శిల్పా శెట్టిపై నమోదైన అట్రాసిటీ కేసు కొట్టివేసిన రాజస్థాన్ హైకోర్టు..

శిల్పా శెట్టిపై నమోదైన అట్రాసిటీ కేసు కొట్టివేసిన రాజస్థాన్ హైకోర్టు..

బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై నమోదైన అట్రాసిటీ కేసుని శుక్రవారం రాజస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో నటి శిల్పా శెట్టి వాల్మీకీలను ఉద్దేశిస్తూ కించపరిచే విధంగా భంగా అనే పదాన్ని ఉపయగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. దీంతో అట్రాసిటీ ఆరోపణలు ఎదుర్కుంటున్న శిల్పా శెట్టికి బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. 

పూర్తివివరాల్లోకి వెళితే నటి శిల్ప శెట్టి 2017లో ఓ ఇంటర్వూలో భాగంగా భంగి అనే ఉపయోగించి మాట్లాడింది. దీంతో కొందరు వాల్మీకి కమ్యూనిటీ సభ్యులు నటి శిల్ప శెట్టిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అట్రాసిటీ కేసులో సెక్షన్ 153(A) క్రింద కేసు నమోదు చెయ్ చేపట్టారు. దీంతో అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. 

ALSO READ : రామ్ చరణ్ RC16 లో సీనియర్ హీరో.. హిట్ కాంబో మళ్ళీ రిపీట్..

ఇటీవలే ఈ కేసుకుకి సంబందించిన పూర్తి వివరాలు కోర్టువారు పరిశిలించారు. ఈ క్రమంలో భంగి అనే పదానికి ప్రాంతాన్నిబట్టి అర్థాలు మారుతుంటాయని, అలాగే సినీ సెలెబ్రెటీలు కూడా ఈ క్యాజువల్ ఉపయోగిస్తుంటారని విచారణలో తేలింది. దీంతో జస్టిస్ అరుణ్ మోంగా విచారణాంతరం శిల్ప శెట్టిపై నమోదైన అట్రాసిటీ కేసుని కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి శిల్ప శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలసి మనీ లాండరింగ్, అడల్ట్ కంటెంట్ మూవీస్ మేకింగ్, తదితర కేసులలో ఆరోపణలు ఎదుర్కుంటోంది.