నేను బిజీ.. నా భర్త ఏం చేసేవాడో తెలియదు

నేను బిజీ.. నా భర్త ఏం చేసేవాడో తెలియదు
  • వ్యాపారాల గురించి తెలుసు.. డీటెయిల్డ్ గా తెలియదు
  • హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి తెలియదు... పోర్నోగ్రఫీ గురించి అస్సలు తెల్వదు
  • షూటింగులో, టీవీ కార్యక్రమాలతో నేను బిజీగా ఉండేదాన్ని

ముంబయి: నేను నిరంతరం షూటింగులు, యోగా.. ఫిట్నెస్ తదితర కార్యక్రమాలతో నిరంతరం బిజీగా గడిపేదాన్నని, నా భర్త రాజ్ కుంద్రా వ్యాపారాలు చేస్తున్నాడని తెలుసుగాని.. వాటి పూర్తి వివరాలు తెలియదని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి చెప్పింది. పోర్నో గ్రఫీ కేసులో ఇప్పటికే రాజ్ కుంద్రాను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కస్టడీలో రాజ్ కుంద్రాతోపాటు.. బాధితులు, ఆయన భార్య శిల్పా శెట్టిని పోలీసులు లోతుగా ప్రశ్నించారు. ఇంట్లో పలుమార్లు సోదాలు చేసి ల్యాప్ టాప్, కంప్యూటర్ హార్డ్ డిస్కులను తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
రాజ్ కుంద్రా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను తనిఖీ చేసి విశ్లేషించిన పోలీసులు సుమారు 1500 పేజీల అనుబంధ చార్జిషీటును బుధవారం దాఖలు చేశారు. 
శిల్పాశెట్టిని తరచి ప్రశ్నించగా.. భర్త వ్యాపారాల గురించి ముఖ్యంగా పోర్నోగ్రఫీ లావాదేవీల గురించి శిల్పాశెట్టికి తెలియదని పోలీసులు భావిస్తున్నారు. శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని కోర్టుకు సమర్పించారు. రాజ్ కుంద్రా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి అనేక మంది అమ్మాయిలను మోసం చేసి పోర్నోగ్రపీ, నీలి చిత్రాలు తీసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. గత జులైలో రాజ్ కుంద్రాను అరెస్టు చేసి అదే నెల 19న జ్యుడీషియల్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ కోర్టు విచారణను పెండింగులో ఉంచింది. ఈ నేపధ్యంలో ముంబయి పోలీసులు విచారించి అనుబంధ చార్జిషీటులో మరిన్ని అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది.