
శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హంపి థియేటర్లో ఒడిస్సీ, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఒడిస్సీ గురువు డాక్టర్ మనసి పాండ్య రఘునందన్తన శిష్యురాలు సంహితతో కలిసి ఒడిస్సీ నృత్యం ప్రదర్శించి మెప్పించారు. అనంతరం వైదేహి సుభాష్ శిష్య బృందం తమ భరతనాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. - వెలుగు, మాదాపూర్