
మాదాపూర్, వెలుగు: శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి, సంగీత కచేరీలు అలరించాయి. చెన్నైకి చెందిన వర్ష రాజ్ కుమార్ తన భరత నాట్య ప్రదర్శనలో అర్ధనారీశ్వరం స్తోత్రం, కంజదళయాదాక్షి, అన్నయ్య కీర్తన, మీరా భజన, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
స్నేహ రాంచందర్ శిష్య బృందం సంగీత కచేరీలో ఏకదంతం వినాయక, నమో శారదా, రామ రామ, శంకర పూజితేయ్, ఎందుకయ్యా సాంబశివ, అంబుజవాసిని , జయ జయ పర్య భారతి పాటలను ఆలపించింది. తాన్యా శ్యామా, ఆధ్య, నేహా, నైతిక, సాయి శ్రీక్షిత, అవంతిక , కీర్తిక, అడ్వికా కృషిత తమ కూచిపూడి నృత్య ప్రదర్శనలో గజాననయుతం, తుంబుర మీటేదెవ, జతిస్వరం, రామదాసు కీర్తన, జనుత శబ్దం, ఆధ్యాత్మరామాయణ కీర్తన అంశాలను ప్రదర్శించి మెప్పించారు