ఇండియాలోనే అతిపెద్దది..ప్రపంచంలో రెండోది..13 స్టేషన్లతో రోప్వే ప్రాజెక్టు..ఎక్కడో తెలుసా..

ఇండియాలోనే అతిపెద్దది..ప్రపంచంలో రెండోది..13 స్టేషన్లతో రోప్వే ప్రాజెక్టు..ఎక్కడో తెలుసా..

13 స్టేషన్లు..ఆకాశ మార్గంలో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం..హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోప్ వే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తియితే సిమ్లాలో ట్రాఫిక్ సమస్యను ఈజీగా అధిగమించగలదు.  

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రోప్ వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సిమ్లాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 13 స్టేషన్లతో 15 కిలోమీటర్లు దూరం రోప్ వే నిర్మాణ ప్రాజెక్టును మొదలు పెట్టింది. దేశంలోనే అతిపొడవైన రోప్ వే, ప్రపంచంలో రెండో అత్యంత పొడవైన ఈ రోప్ వే ప్రాజెక్టు వచ్చే ఏడాది(2025) మార్చిలో  ప్రారంభం కానుంది. 

ALSO READ | నాలుగో జలాంతర్గామిని ఆవిష్కరించిన ఇండియన్ నేవీ

మూడు లైన్లు, 13 స్టేషన్లు, 660 ట్రాలీలతో సిమ్లా రోప్ వే సిమ్లాలో రవాణా రంగంలో కీలకంగా మారనుంది. ఈ రోప్ వే తో గంటకు 6వేల మంది ప్రయాణికులను గమ్యం చేరుస్తుంది. దాదాపు 1734 కోట్లతో సిమ్లాతో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. 

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్(NDB)  అడ్వాన్స్ టెండరింగ్ ఆమోదించింది.  దీపావళి తర్వాత ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మార్చిలో నిర్మాణాన్ని మొదలు పెడతారు 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25వేల రోప్‌వేలు ఉన్నాయి.అయితే భారతదేశంలో ప్రస్తుతం 20 మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన రోప్‌వే 32 కి.మీ పొడవు బొలీవియాలో ఉంది.