ప్రజలు నదులను పరిరక్షించాలి

  • ‘లోక్​మంథన్ భాగ్యనగర్
  • 2024’లో శిప్రాపాఠక్​

హైదరాబాద్, వెలుగు: ప్రజలంతా నదులను పరిరక్షించాలని, కాలుష్యాన్ని నివారించాలని పంచతత్వ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు శిప్రా పాఠక్​ అన్నారు. మనదేశానికి నదులతో ఎంతో సాంస్కృతికి ఔచిత్యం ఉన్నదని తెలిపారు. శనివారం శిల్పకళా వేదికలో నిర్వహించిన లోక్​మంథన్​ భాగ్యనగర్–​2024 కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నదులతోనే నాగరికతలు వృద్ధి చెందాయని, ఆ తర్వాతే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు.