కొల్లాపూర్, వెలుగు : బర్రెలక్కగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కర్ణే శిరీష ఎన్నికల బరిలో నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక బర్రెలు తెచ్చుకొని బతుకుతున్నానని చెప్పారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో గతంలో వీడియో పోస్ట్ చేశానని తెలిపారు. దీంతో ప్రభుత్వం తనపై కేసు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకే కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని శిరీష తెలిపారు.