దిగ్గజ భారత బ్యాటర్ సునీల్ గవాస్కర్ తన విలువైన ఆస్తి గురించి మాట్లాడారు. ఐపిఎల్ 2023 సీజన్ లో ఎంఎస్ ధోని సంతకం చేసిన చొక్కాను తన ఇంట్లో భద్రంగా ఉంచినట్లు గవాస్కర్ వెల్లడించారు.
"నేను మొదటిసారి MSD ఆడటం చూసిన నాటి నుంచి అతని అభిమానిని. ఒక అభిమానికి ఏమి కావాలి? తన హీరోని కలవాలని కోరుకుంటాడు. అతనితో మాట్లాడాలని డు ఆశిస్తాడు. చివరగా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ కూడా పొందడానికి ప్రయత్నిస్తారు. నేను అదే చేశా.. అతని ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అదే మంచి సమయం అని భావించా.. ఎందుకంటే నేను అతన్ని అంతలా చాలా ఆరాధిస్తా.." అని గవాస్కర్ ఎంఎస్ ధోని గురించి స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడారు.
షర్ట్‌పై ఆటోగ్రాఫ్
ఐపీఎల్-16వ సీజన్‌లో అత్యంత హృదయపూర్వక సన్నివేశాల్లో ఇదొకటి. తేదీ 2023, మే 14.. చెన్నైలోని చెపాక్ వేదికగా ధోనీ సేనకు అదే చివరి మ్యాచ్. నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకున్న ధోనీ సేనపై కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయినప్పటికీ వారు అభిమానులను నిరాశ పరచలేదు. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలిపారు.
ALSO READ :- IND vs ENG 5th Test: కొత్త కింగ్: కోహ్లీ 8 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన జైస్వాల్
ఆ సమయంలోనే ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పరుగున మైదానంలోకి వచ్చారు. ధోనీ వద్దకు వెళ్లి తాను వేసుకున్న షర్టుపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. మొదట ఆశ్చర్యపోయిన ధోనీ.. లిటిల్ మాస్టర్‌ను మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అతని కోరికను కాదనకుండా షర్టుపై తన సంతకం చేశారు. ఆ సన్నివేశాలు అప్పట్లో ఒక సంచలనం. ఇంకా చెప్పాలంటే ఆ మ్యాచులో చెన్నై ఓడినా అభిమానులు మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడలేదు. అసలు మ్యాచ్ ఫలితాన్నే పట్టించుకోలేదు. ఆ రోజు ధోని నామస్మరణతో స్టేడియం దద్దరిల్లిపోయింది.
𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛
— IndianPremierLeague (@IPL) May 14, 2023
A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg