బాన్సువాడ నుంచి శ్రీశైలానికి శివదీక్ష స్వాముల పాదయాత్ర

బాన్సువాడ నుంచి శ్రీశైలానికి శివదీక్ష స్వాముల పాదయాత్ర

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ పట్టణం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా గురువారం శివదీక్ష స్వాములు బయలుదేరి వెళ్లారు. 12 రోజులపాటు నడిచి శ్రీశైలం చేరుకుంటారు.  ఇరుముడి కట్టుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి, సుభాష్  గురుస్వామి ఆధ్వర్యంలో 35 మంది బయలుదేరి వెళ్లారు. 

ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ.. మా కుటుంబాలతో పాటు సమాజం బాగుండాలని, ఈశ్వరుని వేడుకుంటామన్నారు. పాదయాత్రలో పోచీరాం, అయ్యల ఆనంద్, నాగనాథ్ అప్ప తదితరులు బయలుదేరి వెళ్లారు.