శ్రీశైలంలో ఇవాళ్టి( డిసెంబర్ 11, 2024 ) నుంచి 15వ తేదీ వరకు శివదీక్షా విరమణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పాతాళగంగ మార్గంలోని శివదీక్ష శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు త్తెలిపారు. నవంబర్ 2వ తేదీన శివ మండల దీక్ష, 21న అర్ధ మండల దీక్ష స్వీకరించిన భక్తులు కూడా ఈ దీక్షా విరమణ సమయంలో దీక్ష విరమణ చేపట్టచ్చని తెలిపారు ఈవో శ్రీనివాసరావు .
దీక్షా విరమణ సందర్భంగా ఇవాళ ( డిసెంబర్ 11, 2024 ) ఉదయం 7.30 గంటలకు ఆలయ దక్షిణ ద్వారం దగ్గర స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆశీనులను చేయించి విశేష పూజలు నిర్బహించనున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి,అమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి శివదీక్షా శిబిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
దీక్షా విరమణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఆలయ సిబ్బందికి మూడు షిఫ్ట్ లలో విధులు కేటాయించినట్లు తెలిపారు ఈవో శ్రీనివాసరావు.