రాజన్న సన్నిధిలో శివ దీక్షలు ప్రారంభం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఏటా శివరాత్రి ముందు శివుడి మాలధారణ చేసి, శివరాత్రి నాడు లింగోధ్బవ సమయంలో శివస్వాములు మాల విరమణ చేస్తారు. 

ఉదయమే ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, గురు స్వాములు తమ్మల సంతోష్, వాసాలమర్రి గోపి అధ్వర్వంలో  సుమారు 300 మంది శివ భక్తులకు మాలధారణ చేశారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో 33 ఏళ్లుగా ఏటా శివుడి మాల వేసుకోవడం 
ఆనవాయితీగా వస్తోంది.