తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ సూపర్ మూవీ అయలాన్(Ayalaan). ఆర్. రవికుమార్(R Ravikumar) తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతమే అందించారు. నిజాంనికి ఈ సినిమా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, ఆ సమయంలో తెలుగులో గట్టి పోటీ ఉండటంతో.. తెలుగులో తప్ప మిగతా అన్ని భాషల్లో రిలీజయింది ఈ మూవీ. ఇక జనవరి 26న తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది.
అయితే తాజాగా అయలాన్ ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. అయలాన్ ఇంకా తెలుగులో రిలీజ్ కాకముందే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రచారంలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న సన్ నెక్స్ట్ ఫిబ్రవరి 16 నుండి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. దీంతో సినీ లవర్స్ అవాక్కవుతున్నారు.
నిజానికి మేకర్స్ మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పాలి. అయలాన్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 16 ఓటీటీ రిలీజ్ అంటే నెలరోజుల పైనే. ఇక తెలుగులో జనవరి 26 అంటే ఫిబ్రవరి 16కి పది రోజులు అవుతుంది. కాబట్టి ఈ పదిరోజుల్లోనే అయలాన్ బిజినెస్ ముగిసిపోతుంది. కాబట్టి వెంటనే ఓటీటీకి రావడంతో ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఎలా చూసుకున్న అయలన్ మేకర్స్ తీసుకున్న డెసిషన్ మంచిదే అని చెప్పుకోవచ్చు.