![భూమ్మీదకు వచ్చిన ఏలియన్‌తో ఫ్రెండ్‌షిప్](https://static.v6velugu.com/uploads/2023/10/Shiva-Karthikeyan,-who-created-special-image-himself-Kollywood-as-well-as-Tollywood,-coming-up-with-Ayalan_OndhqPD47i.jpg)
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శివ కార్తికేయన్. ఇటీవల ‘మహావీరుడు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న శివ.. త్వరలో ‘అయలాన్’ సినిమాతో రాబోతున్నాడు. ఏలియన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ‘ఒక్కో పీరియడ్‌లో ఒక్కో ఎనర్జీ ఈ వరల్డ్‌ను డామినేట్ చేసింది’ అనే డైలాగ్‌తో మొదలైన వీడియో సినిమాపై ఆసక్తిని రేపేలా ఉంది.
అనుకోకుండా భూమ్మీదకు వచ్చిన ఓ ఏలియన్... హీరో శివకార్తికేయన్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం ఇందులో మెయిన్ కాన్సెప్ట్‌గా కనిపిస్తోంది. తన గ్రహానికి కనెక్షన్ కోసం ఏలియన్ ఎలక్ట్రిక్ బోర్డులు రిపేర్ చేస్తుంటే.. అందులో నుంచి తెలుగు పాటలు రావడం, ఏలియన్‌ని టీ పెట్టమంటూ మొట్టికాయలు వేయడం లాంటి సీన్స్‌తో ఇదొక కామెడీ మూవీ అనే ఫీల్ కలిగించారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్.డి.రాజా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.