
వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో శివపార్వతుల కల్యాణం కన్నులపండువగా సాగింది. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శివాలయంలో నిర్వహించిన కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు శివపార్వతుల కల్యాణం నిర్వహించి వేడుక విశేషాలు భక్తులకు వివరించారు. ఆలయ అర్చకులు గంగాధర్, సాయి, గంగపుత్ర ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.