ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన రేరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ, అతిని సోదరుడు శివ నవీన్ కు షరతులతో కోడిన బెయిల్ మంజూరైంది. లక్ష రూపాయల ష్యూరిటీతో నాంపల్లి ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు షరతు విధించింది.
లక్ష రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. హెచ్‌ఎమ్‌డీఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగి 2024 జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ చేసింది.
గత పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇండ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు.