దహెగాం, వెలుగు: ఛత్రపతి శివాజీ మచ్చలేని మహారాజు అని ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. దహెగాం మండలంలోని చిన్నరాస్పల్లిలో ఆరె కులస్తులు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ అన్ని మతాలను సమానంగా చూసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
ఆరె సంక్షేమ సంఘం తాలూకా ఉపాధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు నరులే వాను పటేల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డబ్బుల వెంకన్న, ఉద్యోగ సంఘం నాయకులు నరులే రాందాస్, డోకె దామోదర్, మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మిడి లచ్చన్న, వెంకన్న, చింతల మానేపల్లి ఎంపీపీ డబ్బుల నానయ్య, దహెగాం ఎంపీపీ కంభగౌని సులోచన గౌడ్, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.