
వెలుగు, నెట్వర్క్: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు బుధవారం సిటీలో ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి ప్రముఖులు నివాళులర్పించారు. శివాజీ ధైర్య సాహసాలు, పోరాట ఘట్టాలను గుర్తుచేసుకున్నారు.
శివాజీ స్ఫూర్తిగా ప్రతి హిందువు హైందవ ధర్మ రక్షణ కోసం కృషి చేయాలన్నారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని ఎబ్బనూరులో కొత్త ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో పాల్గొన్నారు.