రూ. 3.44 లక్షల నగదు పట్టివేత

రూ. 3.44 లక్షల నగదు పట్టివేత

నిజామాబాద్ క్రైమ్, వెలుగు :  నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో రెండో టౌన్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 3.44 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. నిజామాబాద్ కు చెందిన చెన్న శివకుమార్ ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తుండడంతో రెండో టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సీజ్ చేసిన నగదు ను ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు టౌన్ సీఐ నరహరి తెలిపారు.