బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఈ సీజన్ కు విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఒక సామాన్య వ్యక్తిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన ఆటతీరుతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకొని బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. దీంతో అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ నుండి శివాజీ సెంకండ్ రన్నరప్ గా వెనుదిరగడం చాలా మందికి నచ్చలేదు. నిజానికి ఈ సీజన్ విన్నర్ శివాజీ అవుతారని చాలా మంది అనుకున్నారు. అన్ అఫీషియల్ పోల్స్ లో కూడా శివాజీ టాప్ లో నిలిచాడు. కానీ.. మూడవ స్థానంలో నుండి బయటకు రావడాన్ని ఆయన ఫ్యాన్స్ తీసుకోలేక పోతున్నారు.
ఇదే విషయంపై శివాజీ కూడా స్పందించారు. బిగ్ బాస్ జర్నీ తరువాత ప్రతీ కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. నిన్న శివాజీ కూడా బజ్ కు వచ్చి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ముందు ప్రశ్నగా యాంకర్ గీతూ శివాజీని.. టాప్ 3 వరకు వస్తానని అనుకున్నారా అని అడగగా.. దానికి శివాజీ టాప్ 3 ఏంటమ్మా.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ నేనే.. అది నాకు తెలుసు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అది విన్న గీతూ, ఆడియన్స్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో శివాజీ బిగ్ బాస్ రిజల్ట్ తో సంతృప్తిగా లేరని క్లియర్ గా అర్థమవుతోంది. రిజల్ట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, ఈ థర్డ్ పొజిషన్ కూడా కావాలనే ఇచ్చారు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు శివాజీ. ఇక అమర్ ను కావాలనే ముందు నుండే టార్గెట్ చేశారని గీతూ అనగా.. అమర్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అమర్ ఫ్యాన్స్ కు కుండ్ షాకించాడు శివాజీ. మరి ఈ విషయంపై శివాజీ ముందు ముందు ఎలాంటి కామెంట్స్, కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారో చూడాలి.