Dandora: తెలంగాణ గ్రామీణ నేప‌‌థ్యంలో శివాజీ దండోరా.. పని మారితే కులం కూడా మారాలి కదా..?

Dandora: తెలంగాణ గ్రామీణ నేప‌‌థ్యంలో శివాజీ దండోరా.. పని మారితే కులం కూడా మారాలి కదా..?

శివాజీ,  నవదీప్,  రాహుల్‌‌ రామకృష్ణ,  రవికృష్ణ,  మనీక చిక్కాల, అనూష  ప్రధానపాత్రల్లో ‘దండోరా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.  కలర్ ఫొటో, బెదురులంక 2012 చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. మురళీకాంత్ దర్శకుడు. బుధవారం Dec 12న రామానాయుడు స్టూడియోస్‌‌లో ఈ సినిమాను ప్రారంభించారు.

 ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. ‘బేబీ’ నిర్మాత ఎస్‌‌కేఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో నిర్మాత సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో.. మన ఆచారాలు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ.. హాస్యం, వ్యంగ్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. 

ALSO READ : కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా ఫంకీ సినిమా

మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘చేసే పనినిబట్టే కులం అన్నప్పుడు..  పని మారితే కులం కూడా మారాలి కదా..?’ అనే క్యాప్షన్‌‌తో విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది.