జుక్కల్​ మండలంలో శివాజీ విగ్రహం చోరీ

జుక్కల్​ మండలంలో శివాజీ విగ్రహం చోరీ

పిట్లం, వెలుగు: జుక్కల్​ మండలంలో శివాజీ విగ్రహం చోరీకి గురైంది. శనివారం రాత్రి జుక్కల్  మండలం డోన్​గాం, సోపూర్​ దారిలో శక్తినగర్​ చౌరస్తాలో ప్రతిష్టించిన శివాజీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. 

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జుక్కల్​  పోలీసులు శక్తినగర్​ చౌరస్తాలోని విగ్రహం గద్దెను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భువనేశ్వర్​ తెలిపారు.