గో రక్షణే ధ్యేయంగా మునుగోడు ఉప ఎన్నిక బరిలో యుగతులసి తరపున తమ అభ్యర్థి పోటీ చేస్తారని ఆ సంస్థ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు శివకుమార్ చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని శివకుమార్ డిమాండ్ చేశారు. గోవుల రక్షణకు చాలా చట్టాలు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మునుగోడులో ప్రతి ఇంటికి తులసి మొక్క ఇచ్చి..గోమాతకు ఓటేయమని ఓటర్లను అడుగుతామని చెప్పారు.
మూగ జీవులను బతికించడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కొందరు హిందూత్వం అడ్డుపెట్టుకుని రాజకీయ చేస్తున్నారని అన్నారు. గోరక్షణ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విజయవాడ హైవే మీదుగా వందలాది గోవులను తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.