భారత క్రికెట్ లో ధోనీ సాధించిన సంచలనాలు చాలానే ఉన్నాయి. కెప్టెన్ గా, బ్యాటర్ గా లెక్కకు మించిన ఎన్నో రికార్డులు నెలకొల్పిన మాహీ.. భారత క్రికెట్ లో చెరగని ముద్ర వేసాడు. అయితే మహేంద్రుడికి వ్యక్తిగతంగా కంటే కెప్టెన్ గానే ఎక్కువ రికార్డులు ఉన్నాయి. ధోనీ అంటే కేవలం రికార్డులు మాత్రమే కాదు.. యంగ్ ప్లేయర్లను ముందుండి ప్రోత్సహిస్తూ వారి కెరీర్ ను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ లిస్టులోకి తాజాగా శివమ్ దూబే చేరిపోయాడు.
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఆల్ రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ దొరకటం కష్టమే అనుకున్నారు. ఒకవేళ అవకాశం వచ్చినా నిరూపించుకోవడం అసాధ్యమేనని భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ దూబే విధ్వసం వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత దూబే జియో సినిమాతో మాట్లాడుతూ.. క్రెడిట్ అంతా ధోనీకే చెందుతుందని అని చెప్పుకొచ్చాడు. తనలోని ఆట గుర్తించినందుకు ధోనీతో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇదిలా ఉండగా.. టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత దూబే ఐపీఎల్ లో CSK తరపున 2023 సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో భారత జట్టులో ఎంపికైన ఈ ఆల్ రౌండర్ వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. హార్దిక్ పాండ్య గాయంతో ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ లో ఆల్ రౌండర్ గా తుది జట్టులో స్థానం దక్కించుకొని అదరగొట్టేస్తున్నాడు. తొలి టీ20 లో 60 పరుగులు చేసిన దూబే.. నిన్న జరిగిన రెండో టీ20 లో 32 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Shivam Dube said, "my success credit goes to MS Dhoni and CSK. Mahi bhai gave me confidence that I can do it, CSK management told me they believed in me and always had the faith that I could perform". pic.twitter.com/3r6YwzAMUH
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024