కాగజ్నగర్ లో ఘనంగా శివమల్లన్న స్వామి జాతర

కుమ్రంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం ఈస్ గాంలో శివమల్లన్న స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. కాగజ్ నగర్, దహెగాం, సిర్పూర్ టి మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం చుట్టు పక్కల ఉన్న ఖాళీ స్థలంలో బోనాలు తయారు చేశారు.

కొత్తగా పండిన పంటను ఈ జాతరలో బోనంగా సమర్పించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం కట్టెల పొయ్యిపై బెల్లం, బియ్యంతో అన్నం వండారు. చిక్కుడుకాయ, వంకాయ, టమాటాతో కూరలు చేశారు. వీటిని బోనంగా తయారు చేసి, స్వామి వారికి సమర్పించారు. 

శివమల్లన్న జాతరకు జనం భారీగా వస్తుండడంతో అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈస్ గాం ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో భక్తులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.