శివంగి నుండి ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్

శివంగి నుండి ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్

ఆనంది, వరలక్ష్మి శరత్‌‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన  విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శివంగి’.  దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో పి.సురేష్​ బాబు నిర్మించారు.  జాన్ విజయ్, డా. కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. గురువారం ఈ చిత్రం నుంచి ఆనంది ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను డైరెక్టర్ అనిల్  రావిపూడి లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  బ్లాక్ డ్రెస్‌‌లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నుదిటిపై విబూదితో సోఫాలో డైనమిక్‌‌గా కూర్చున్న ఆనంది లుక్ స్టన్నింగ్‌‌గా ఉంది. 

నిజమైన శివంగిలా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకున్న ఈ  చిత్రానికి ఎబినేజర్ పాల్  సంగీతం అందిస్తున్నాడు. మార్చి 7న సినిమా విడుదల కానుంది.