నేను ఎవరి జోలికి వెళ్లను..భయంతో కాదు..రణరంగం మారణహోమంలా మారుతుందని: శివన్న ఘోస్ట్ ట్రైలర్

నేను ఎవరి జోలికి వెళ్లను..భయంతో కాదు..రణరంగం మారణహోమంలా మారుతుందని: శివన్న ఘోస్ట్ ట్రైలర్

కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్(Shivarajkumar) పాన్ ఇండియా ఫిలిం ఘోస్ట్(Ghost).  కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ బీర్బల్ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి(S. S. Rajamouli) రిలీజ్ చేసి శివన్నకు కంగ్రాట్స్.. ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ ట్రైలర్‌ విషయానికి వస్తే.. 

ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా శివన్న డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం..ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా.. అవి చేసే నష్టాలే ఎక్కువ..సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండొచ్చు..కానీ విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు..అంటూ శివ రాజ్ కుమార్ చెప్పిన డైలాగ్ వావ్ అనేలా ఉంది.

అలాగే..నేను ఎవరి జోలికి వెళ్లను..భయంతో కాదు..నేను వెళ్తే రణరంగం మారణహోమంలా మారుతుందని అంటూ ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. ఈ మూవీలో జయరాం, అనుపమ్ ఖేర్‌ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.

రీసెంట్గా ఈ మూవీ నుంచి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ అంటూ..లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ లో గ్యాంగ్‌‌స్టర్ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు శివన్న. అర్జున్ జన్య  కంపోజ్ చేసిన పాటలో వీరాధి వీరుడీడు..వింటేజ్ వాక్ చూడు..వేటాడే వేటగాడు.. ఎదురొచ్చే వాడు లేడు..వచ్చేటి స్టైల్ చూడు..అంటూ శివరాజ్‌‌ కుమార్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా తెలుగు లిరిక్స్‌‌ను ఎంసీ చేతన్ రాయడంతో పాటు తనే స్వయంగా పాడాడు. హై ఓల్టేజ్ సాంగ్‌‌లో శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌‌తో పాటు, మేకింగ్ గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. 

ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దసరా కి వస్తోన్న ఈ మూవీకి పోటీగా బాలయ్య భగవంత్ కేసరి, రావితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీస్ రిలీజ్ కానున్నాయి. దీంతో దసరాకి  రసవత్తరమైన పోటీ నెలకొంది.