యాదగిరిగుట్టలో ఘనంగా ధ్వజారోహణం  

యాదగిరిగుట్టలో ఘనంగా ధ్వజారోహణం  

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టపై గల పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం భేరిపూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ జరిపారు.

పూజల్లో ఆలయ చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి, ఏఈవో గజవెల్లి రమేశ్‌‌‌‌బాబు, సూపరింటెండెంట్‌‌‌‌ రామారావు, ప్రధానార్చకులు నరసింహరాములు, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, ముఖ్య అర్చకులు నరసింహమూర్తి, శ్రీధర్‌‌‌‌శర్మ, అర్చకులు శ్రీనివాస్‌‌‌‌శర్మ, సాయికృష్ణ శర్మ పాల్గొన్నారు.

ఇయ్యాల శివపార్వతుల కల్యాణం

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రుద్రహవనం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు శివపార్వతుల కల్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను  అందుబాటులోకి తీసుకొచ్చిన ఆఫీసర్లు ఒక్కో టికెట్‌‌‌‌ ధర రూ.516గా నిర్ణయించారు. ఒక టికెట్‌‌‌‌పై దంపతులిద్దరిని మాత్రమే అనుమతించనున్నారు.