ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మండలం చేపూర్ లోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి 5 రోజుల పాటు శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆర్మూర్ ఎస్హెచ్వో రవి కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. సీఐ రవికుమార్ మాట్లాడుతూ..
వీడీసీ ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వీడీసీ ప్రెసిడెంట్ రెక్కల గంగారెడ్డి, క్యాషియర్ దాసరి నాగరాజ్, మాజీ ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్, మాజీ సర్పంచ్ కె.గంగారెడ్డి, బద్ధం రాజు, సురేశ్ రుక్మాజీ, దాసరి శ్రీకాంత్, సింధుకర్ చరణ్ , లింగం గౌడ్, సారంగి శాంతి కుమార్, పురోహితులు కిరీటి కుమార్ జోషి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.