క్రీడా వికాసమే లక్ష్యంగా పని చేస్తా

  • స్పోర్ట్స్ అథారిటీ నూతన చైర్మన్ శివసేనా రెడ్డి

హైదరాబాద్ ,వెలుగు :  గత పదేండ్లు రాష్ట్రంలో క్రీడారంగాన్ని విధ్వంసం చేశారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్) చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివసేనా రెడ్డి అన్నారు.  పదేండ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు క్రీడారంగాన్ని నడిపిస్తానని, ఇందుకు అందరి సలహాలు, సూచనలు తీసుకుంటానని  తెలిపారు. సాట్ నూతన చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ తన పదవీకాలంలో క్రీడా రంగంలో సమూల మార్పులకు కృషి చేస్తానని  చెప్పారు.

సమగ్ర క్రీడా వికాసమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ శివసేనా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.