స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలోని జఫర్‌గఢ్ రోడ్డులో అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇటీవల బీటీ రోడ్డు రిపేర్ పనులు జరిగాయి. కొద్ది రోజులకే కంకర తేలి గుంతలమయంగా మారింది. ఈ జంక్షన్ మూలమలుపు కావడంతో ప్రమాదలు కూడా జరుగుతున్నాయి.
ప్రజల ఫిర్యాదుతో ఇటీవల రోడ్డు మరమ్మతులు చేపట్టగా, ఇప్పడు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఆఫీసర్లు నాణ్యతతో రోడ్డు వేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యత పాటించి రోడ్డు రిపేర్ చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.