భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 ల సిరీస్ లో భాగంగా వైజాగ్ లో జరిగిన తొలి టీ20 లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా విధించిన 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి బంతికి రింకూ సింగ్ సిక్సర్ కొట్టి భారత్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ విజయంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 42 బంతుల్లోనే 80 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో సూర్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ హైడెన్ సూర్యపై సెటైర్ వేసాడు. హైడెన్ చేసిన కామెంట్స్ కు పాక్ మాజీ క్రికెటర్ వ్యంగ్యంగా స్పందించాడు.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తుగా కొడుతున్నప్పుడు కామెంటేటర్ రవి శాస్త్రి సూర్య బాగా ఆడుతున్నాడు. అతడిని ఎలా ఆపాలి? అతడి అద్భుతమైన ఫామ్ ను ఆపేవారు ఎవరైనా ఉన్నారా? అని కామెంటరీలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నకు పక్కనే ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ హైడెన్ సూర్య కుమార్ యాదవ్ కు ఇది వన్డే వరల్డ్ కప్ అని గుర్తు చేయండి అని సెటైర్ వేసాడు. ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సూర్య పేలవ ఆటతీరుతో విమర్శకులకు టార్గెట్ అయ్యాడు.
హార్దిక్ గాయంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 28 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసాడు. కానీ తనకు అచొచ్చిన టీ20 ల్లో అదరగొట్టేసాడు. దీంతో హైడెన్ సూర్య బ్యాటింగ్ పై ఇలా స్పందించాడు. అయితే హైడెన్ సూర్యపై వేసిన కౌంటర్ కు అక్తర్ సూపర్ హైడెన్ అని నవ్వుతున్న పిక్స్ ట్విట్టర్ లో షేర్ చేసాడు. సాటి ప్లేయర్ ను ఇలా అవమానపరచడంలో పాక్ ప్లేయర్లు ముందు వరుసలో ఉంటారు. అక్తర్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. పాక్ కనీసం సెమీస్ కు చేరలేదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
This was hilarious Haydos@RaviShastriOfc: "How do you stop Suryakumar Yadav when he is in this top form?" @HaydosTweets : "Tell him its an ODI !!"
— Shoaib Akhtar (@shoaib100mph) November 24, 2023
???