పాకిస్థాన్ మాజీ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ భారత్ పై కోపమో లేకపోతే పాకిస్థాన్ పై ఇష్టమో తెలియదు గాని ఎప్పుడు ఊహకందని వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. భారత్ పై పాక్ మ్యాచ్ అంటే చాలు విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసేస్తాడు. పాక్ మద్దతు ఇవ్వడంలో తప్పు లేదు కానీ భారత్ ని తక్కువ చేసి మాట్లాడడం కాస్త ఓవరాక్షన్ లా అనిపిస్తుంది. తాజాగా ఒక ట్వీట్ చేసిపరువు పోగొట్టుకున్నాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచుపై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మ్యాచు జరుగుతున్నప్పుడు పాక్ 350 స్కోర్ కొడుతుందని.. బాబర్ భారీ సెంచరీ ఖాయం అని జోస్యం చెప్పాడు. దానికి తగ్గట్లే పాక్ మొదటి 30 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లను 155 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ఈ సమయంలో ఒక్కసారిగా భారత బౌలర్లు విజ్రంభించడంతో పాక్ తమ చివరి 8 వికెట్లను కేవలం 36 పరుగులకే కోల్పోయింది. బాబర్ 50 పరుగులు చేసి ఔటవ్వగా.. పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. అక్తర్ బాబర్ 150 కొడతాడని చెబితే పాక్ టీం మొత్తం కలిసి 200 పరుగులు చేయలేకపోవడం విశేషం. ఇలాంటి అత్యుత్సాహం తగ్గించి కాస్త నీ పనికిరాని జోస్యం నెటిజన్స్ జోస్యం చెబుతున్నారు.
కాగా.. ఈ మ్యాచులో పాకిస్థాన్ 191 పరుగులకే కుప్పకూలింది. బాబర్ (50) రిజవాన్ (49) ఇమాములు హక్ (36) పర్వాలేదనిపించగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మొత్తానికి మరోసారి అర్ధం లేని కామెంట్లు చేసి అక్తర్ మూల్యాన్ని చెల్లించుకున్నాడు.