షాహీన్ ని ఎదుర్కొనే సీన్ రోహిత్ కి లేదు.. మరోసారి అక్తర్ సంచలన వ్యాఖ్యలు

షాహీన్ ని ఎదుర్కొనే సీన్  రోహిత్ కి లేదు.. మరోసారి అక్తర్ సంచలన వ్యాఖ్యలు

ఆసియా కప్ లో భాగంగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇండియా బ్యాటింగ్ ప్రాక్టీస్, పాకిస్థాన్ బౌలింగ్ ప్రాక్టీస్ మినహా ఈ మ్యాచ్ ఎంజాయ్ చేయాలని భావించిన అభిమానులకి నిరాశే ఎదురైంది. మ్యాచ్ సంగతి పక్కన పెడితే భారత్ టాపార్డర్ ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యారు.పాకిస్థాన్ పేస్ సంచలనం షహీన్ ఆఫ్రిది ఓపెనర్ రోహిత్ శర్మ తో పాటు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసి తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాట పట్టించాడు. ఈ మ్యాచ్ అనంతరం షోయాబ్ అక్తర్ రోహిత్ శర్మ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ ఆడలేడని ఘాటు వ్యాఖ్యలు చేసాడు.
 
రోహిత్ ఎప్పటికీ అర్ధం చేసుకోలేదు

కావాల్సినంత అనుభవం ఉన్నా.. షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ వైఫల్యంతో  పాక్ మాజీ పేసర్ అక్తర్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. "షహీన్ బౌలింగ్ లో పదే పదే రోహిత్ విఫలమవుతున్నాడు. సహజంగా రోహిత్ చాలా గొప్ప ఆటగాడు. అతడి సామర్ధ్యం అందరికీ తెలిసిందే. అయితే షాహీన్ బౌలింగ్ రోహిత్ ఎప్పటికీ అర్ధం చేసుకోలేడు. రోహిత్ ఆఫ్రిది విషయంలో ఎక్కువగా ఆలోచించడమే దీనికి కారణం".అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వ్యాఖ్యానించాడు.

సూపర్-4 లో ఆదివారం పాక్ తో మ్యాచ్:


గ్రూప్ మ్యాచ్ లో విఫలమైనా..రోహిత్ పాక్ బౌలర్ ఆఫ్రిది మీద రివెంజ్ తీసుకోవడానికి మరో ఛాన్స్ ఉంది. సూపర్-4 లో భాగంగా ఈ ఆదివారం భారత్- పాక్ తలపడనున్నాయి. మరి ఈ మ్యాచులో మరోసారి మన కెప్టెన్ చేతులెత్తేస్తాడా..? లేకపోతే చెలరేగుతాడో చూడాలి.