రాంచీ టెస్ట్ లో భారత్ విజయం సాధించాలంటే శ్రమించక తెప్పేలా లేదు. తొలి ఇన్నింగ్స్ లో ఆచి తూచి బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేసింది. రెండో రోజు టీ విరామానికి 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజ్ లో సర్ఫరాజ్ అహ్మద్ (1), జైస్వాల్ (54) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 222 పరుగుల వెనకబడి ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉండడటంతో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం సాధించడం కష్టంగానే కనిపిస్తుంది.
వికెట్ నష్టానికి 34 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్.. గిల్, జైస్వాల్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్ కు కష్టంగా ఉండటంతో వీరు షాట్స్ ఆడే సాహసం చేయలేదు. దీంతో వికెట్ కు ప్రాధ్యానమిచ్చే క్రమంలో పరుగుల వేగం తగ్గింది. కుదురుకున్న గిల్ కొన్ని బౌండరీలు కొట్టి మంచి టచ్ లోకి వచ్చాడు. అయితే ఈ దశలో ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ భారత్ ను దెబ్బ కొట్టాడు. గిల్, పటిదార్, జడేజా లను ఔట్ చేసి భారత్ కు ఊహించని షాక్ ఇచ్చాడు.
ఒకదశలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. 130 పరుగులకు 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు జైశ్వాల్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ సిరీస్ లో మరో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గిల్ 38 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. పటిదార్(17), జడేజా(12) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ కు వికెట్లు దక్కాయి. అండర్సన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకముందు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌటైంది.
20-year-old Shoaib Bashir has cast a spell on India 💫 https://t.co/N9hKxN5VXN | #INDvENG pic.twitter.com/rU9vNntFpM
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2024