IND vs ENG 5th Test: వీడెవడండీ బాబు.. క్లీన్ బౌల్డ్ అయినా రివ్యూ తీసుకున్నాడు

క్రికెట్ లో ఫన్నీ సంఘటనలు జరగడం సహజమే. కానీ కొన్ని సార్లు అనుకోకుండా చేసే పనులకు అసలు నవ్వాగదు. తాజాగా ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్ షోయబ్ బషీర్ చేసిన పని ఈ కోవలోకే వస్తుంది. క్లీన్ బౌల్డ్ అయినా కూడా రివ్యూ తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 46 ఓవర్లో జడేజా వేసిన బంతికి బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే తాను బౌల్డ్ అయిన సంగతి బషీర్ గమనించలేదు. వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ అనుకోని వెంటనే రివ్యూ కోరాడు. 

ఇది చూసిన సహచరుడు జో రూట్ నువ్వు బౌల్డ్ అయ్యావని చెప్పడంతో బషీర్ కు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ చేసిన పనికి తనతో పాటు గ్రౌండ్ లో ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న రూట్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బషీర్ తీసుకున్న డీఆర్ఎస్ కు నెటిజన్స్ ఫన్నీగా  కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రూట్ తో కలిసి 48 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన బషీర్ (11) భారత్ విజయాన్ని ఆలస్యం చేశాడు.

ALSO READ :- 13 స్థానాలపై ఫ్లాష్​ సర్వే .. రంగంలోకి సునీల్ కనుగోలు టీం

5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-4 తేడాతో సిరీస్ కోల్పోయినా.. బషీర్ తన స్పిన్ మ్యాజిక్ తో మాయ చేశాడు. ముఖ్యంగా చివరి రెండు టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో అదరగొట్టాడు. రాంచీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 8 వికెట్లు తీసిన ఈ ఇంగ్లీష్ స్పిన్నర్ .. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్ ల్లోనే 13 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుకు భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. నేడు ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓడిపోయింది.