
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (2025 ఏప్రిల్ 22న) జరిగిన ఉగ్రవాద దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కపడింది. అందరూ షాక్‌కు గురయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు 28 మంది పర్యాటకుల పేర్లు అడిగి, ఆపై వారిని కాల్చి చంపిన తీరుపై యావత్ భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎంతో మంది తమ ప్రాణాలను అరచేత పట్టుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో బాలీవుడ్ టెలివిజన్ జంట దీపికా కాకర్ మరియు షోయబ్ ఇబ్రహీం సురక్షితంగా బయటపడ్డారు.
ఇటీవల ఈ జంట (దీపికా-షోయబ్) తమ కుమారుడు రుహాన్‌తో కలిసి జమ్మూ కాశ్మీర్ ట్రిప్కి వెళ్లారు. అక్కడీ విహారయాత్రలో గడిపిన ఫోటోలను ఆదివారం (ఏప్రిల్ 20న) తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు. కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి, సమయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో చెబుతూ వీడియో ద్వారా పంచుకున్నారు.
అయితే, దాడి జరిగిన తర్వాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుక్కున్నారేమోనని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టారు. దాంతో దీపికా భర్త నటుడు షోయబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపాడు.
“హాయ్ గైస్, మీరందరూ మా శ్రేయస్సు కోసం ఆందోళన చెందారు… మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరాము. మేము సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాము. మీ అందరి ఆందోళనకు ధన్యవాదాలు.. కొత్త వ్లాగ్ త్వరలో వస్తుంది.” అంటూ పోస్ట్ చేశాడు.
అయితే, ఇపుడు నటుడు షోయబ్ చేసిన పోస్ట్ విమర్శలకు దారితీస్తోంది. ఒక వ్లాగ్ త్వరలో వస్తుంది అనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ఇంత దారుణమైన దాడి మధ్యలో, అతను తన వ్లాగ్‌తో బిజీగా ఉన్నాడు.
మరొక నెటిజన్ రియాక్ట్ అవుతూ.. "వారి ధైర్యాన్ని చూడండి, ఇక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారు మాత్రం మా కొత్త వ్లాగ్ వస్తోందని చెబుతున్నారు" అన్నాడు. ఇలా పలువురు పలురకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
►ALSO READ | PahalgamTerroristAttack:టూరిస్టులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన సీనీ ప్రముఖులు..
బైసారన్ లోయలోని పర్వతం నుండి దిగి వచ్చిన ఉగ్రవాదులు, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. కాల్పుల మోత మోగిన వెంటనే, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. కొందరు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.