పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను టీ20 కెరీర్‌కు ఎప్పుడు ముగింపు పలకాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దీంతో అంతర్జాతీయ టీ20 లకు మాలిక్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే బిగ్ షాక్ ఇచ్చాడు. పాకిస్థాన్ జట్టు తరపున క్రికెట్ ఆడే ఆసక్తి లేదని స్పష్టం చేశాడు.
పాకిస్థాన్ తరపున చాలా సంవత్సరాలు ఆడినందుకు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. పాకిస్థాన్ తరఫున మళ్లీ ఆడేందుకు నాకు ఆసక్తి లేదు. నేను ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతూ ఆస్వాదిస్తున్నాను. ఎక్కడ ఆడే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను". అని షోయబ్ మాలిక్ క్రికెట్ పాకిస్థాన్‌తో అన్నారు. దీంతో మాలిక్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది.
42 ఏళ్ళ మాలిక్ ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 లో పాకిస్థాన్ జట్టుకు అందుబాటులో ఉంటానని చెప్పినా.. అతన్ని సెలక్ట్ చేయలేదు. మాలిక్ చివరిసారిగా దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆడాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ తరపున 124 టీ20 మ్యాచ్ ల్లో 2435 పరుగులు చేశాడు. వీటిలో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 287 వన్డేల్లో 7534.. 35 టెస్టుల్లో 1838 పరుగులు చేశాడు.
🚨 Shoaib Malik said: I have no interest in playing for Pakistan again. [Cricket Pakistan] pic.twitter.com/lJ8dUbMMGB
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) July 25, 2024