నవీపేట్లో ఇరిగేషన్ ఆఫీసు ఎదుట వార్డు సభ్యురాలి ధర్నా

నవీపేట్, వెలుగు: నవీపేట్‌ ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట మొదటి వార్డు సభ్యురాలు శోభ మంగళవారం నిరసనకు దిగారు.  ఇరిగేషన్ కాలువకు ఆనుకుని అక్రమ కట్టడాల నిర్మాణం చేపట్టారని వాటిని తొలగించాలని గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు  పట్టించుకోవడం  లేదని విమర్శించారు.  

దీంతో స్పందించిన ఇరిగేషన్ డిఈ బలరామ్‌, ఏఈ శ్రీధర్ అక్రమ కట్టడాలను పరిశీలించారు.