కేరళలో ఇజ్రాయెల్ 36 ఏళ్ల మహిళ మృతి కలకలం రేపుతోంది. దక్షిణ కేరళలో కొల్లాం జిల్లాలో తన నివాసంలో గురువారం (డిసెంబర్1) ఇజ్రాయెల్ కు చెందిన మహిళ శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. యోగా టీచర్ గా పనిచేస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు ఆమెను హత్య చేసి ఉండొచ్చి పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
దక్షిణ కేరళలోని కొల్లాం జిల్లాలో 36 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ యోగా టీచర్ అయిన 76 యేళ్ల వృద్ధునితో సహజీవనం చేస్తోంది. గురువారం ఆమె నివాసంలో మృతిచెందగా.. వృద్దుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడే ఆమెను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నిందితుడి బంధువు వచ్చి చూడగా.. దంపతులిద్దరూ గదిలో రక్తపు మడుగులో కనిపించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.బంధువు సాయం కేకలు వేయడంతో నిందితుడు లేచి తలుపులు మూసినట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఆ మహిళ చనిపోయి ఉందని పోలీసులు తెలిపారు.
మృతురాలు గత 15ఏళ్లుగా ఉత్తరాఖండ్ నివసించేదని..గతేడాది కేరళకు వచ్చినట్లు తెలుస్తోంది. యోగా టీచర్ అయిన వృద్దునితో సహజీవనం చేస్తున్నట్లు నిందితుడి బంధువులు తెలిపారు.
‘‘తాను సోరియాసిస్ తోనూ,. ఇజ్రాయెల్ మహిళ డిప్రెషన్ తోనూ బాధపడుతున్నట్లు.. అందుకే తాము ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు’’ నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. గదిలో సూసైడ్ నోట్ దొరికిందని దీనిపై ఇంకా విశ్లేషించలేదని తెలిపారు.