రంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు సిద్ధల దశరథ బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు సిద్ధల దశరథ తెలిపారు. బీఆర్ ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి వర్గంపై సబితాఇంద్రారెడ్డి వివక్ష చూపుతున్నారని.. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ ఎస్ నేతలతో కలిసి మరో రెండు రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు సిద్ధల దశరథ ప్రకటించారు.
ALSO READ : స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం: మోడీకి మొరపెట్టుకున్న పాకిస్తాన్ క్రికెటర్