
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ కుమార్ లపై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్ల నిర్ణయం తీసుకున్నారు. 9 మంది కౌన్సిలర్ సంతకాలతో కూడిన అవిశ్వాసం తీర్మానం పత్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీకి అందజేశారు. మొత్తం 13 మందిలో కౌన్సిలర్లలో 11 మంది బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ నుంచి ఎన్నిక చేశారు.
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, అంతకుముందు ముందు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసంకు మద్దతునిచ్చారు.