గత వారం రోజులుగా బంగారం రేట్లలో భారీ మార్పు కనిపిస్తోంది. బాగా తగ్గిన గోల్డ్ రేట్లు యూ టర్న్ తీసుకొని కాస్త పుంజుకున్నాయి. నిన్నటితో పోల్చితే బుధవారం బంగారం రేటులో భారీ మార్పు కనిపించింది. ఒక్కసారిగా బంగారం ధరలు 500 రూపాయల పెరిగాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు మరింత ప్రియం అయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66 వేల 600గా ఉండగా.. బుధవారం (ఆగస్టు 21) 500 రూపాయలు పెరిగి రూ.67 వేల 100లకు చేరింది.
గత నెలలో 75 వేల మార్క్ టచ్ చేసిన గోల్డ్ రేటు ఇప్పుడు బాగా తగ్గింది. ఈ ఏడాది బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా తగ్గి.. మళ్ళీ పుంజుకున్న గోల్డ్ రేట్లు ఇప్పుడు తిరిగి ఆకర్షిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,250 ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,350 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,800గా ఉంది.
Also Read :- ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుందోచ్..
మరోవైపు వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బంగారం తోపాటే వెండి ధర కూడా పెరిగింది. సిల్వర్ రేట్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 92 వేలకు లభిస్తోంది. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.