
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రెండు విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ.. వ్యక్తిగత కారణాలతో గురువారం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అతను మళ్లీ జట్టుతో ఎప్పుడు కలుస్తాడనే దానిపై క్లారిటీ లేదు.
ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లే ఆడిన రబాడ రెండు వికెట్లు తీశాడు. బుధవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ తీసి స్కోరును కట్టడి చేశాడు. రబాడ గైర్హాజరీతో గుజరాత్ పేస్ బౌలింగ్ బలం మొత్తం ఇప్పుడు గెరాల్డ్ కోయెట్జీ, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్‌పై ఆధారపడి ఉంది. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు అత్యంత కీలకం కానున్నారు.