- కోవిడ్ ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న ఆటోమోటీవ్ ఇండస్ట్రీ
న్యూఢిల్లీ: కోవిడ్ ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది ఆటోమోటివ్ ఇండస్ట్రీ. కోవిడ్ వల్ల స్టీల్ రేట్స్ భారీగా పెరగడం, సెమీ కండక్టర్ల చిప్స్ షార్టేజ్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆటోమోటివ్ ఇండస్ట్రీకి ఇబ్బందులు తప్పడం లేదు. తమ నష్టాలను పూడ్చుకునేందుకు వరుసగా వాహనాల ధరలను పెంచుతున్నాయి ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్షరింగ్ సంస్థలు.
కొత్తగా వాహనాలు కొనేవారికి మ్యానుఫ్యాక్షరింగ్ సంస్థలు షాక్ ఇస్తున్నాయి. వాహనాల ధరలను వేల రూపాయల్లో పెంచుతూ.. ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ధరల్ని పెంచాయి ఆటోమోటివ్ సంస్థలు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి వరుసగా స్టీల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాహనాల తయారీకి వాడే ముడిసరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం టన్నుకు 36 వేల 5 వందలు ఉన్న స్టీల్ ధర... ఇప్పుడు 52 వేల పైనే ఉంది. ఇప్పటికే రెండు సార్లు స్టీల్ ధరలు పెంచిన దేశీయ ఉక్కు కర్మాగారాలు మళ్లీ పెంచే ఆలోచనలో ఉన్నాయి. దీంతో చాలా కంపెనీలు వాహనాల తయారీని తగ్గించాయి కూడా. కొత్త వాహనాలు కొనే వారికి నెల నుంచి రెండు నెలలు ఉన్న వెయిటింగ్ పీరియడ్.. ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది నెలలపైనే ఉంది.
రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ఇప్పటికే రెండు సార్లు వాహనాల ధరలని పెంచిన ఆటోమోటీవ్ కంపెనీలు.. వచ్చే ఏడాది మరోసారి పెంచే ఆలోచనలో ఉన్నాయి. టాటా మోటార్స్ రెండు శాతం ధరని పెంచితే... మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ లాంటి సంస్థలు మూడు శాతం వరకు ధరల్ని పెంచాయి. దీంతో కస్టమర్ పై ఆయా రేంజ్ కార్ ప్రైజ్ ని బట్టి... 20 నుంచి 50 వేల వరకు అదనపు భారం పడనుంది. ఎనిమిది సీట్ల లోపు కార్లకు ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తుండటంతో ... కార్ల ధరలు మరోసారి పెరుగుతాయని ఆటో ఇండస్ట్రీ ప్రకటించింది. అది 50 నుంచి లక్ష రూపాయల వరకూ ఉండొచ్చంటున్నారు. దీంతో మొత్తమ్మీద కస్టమర్ పై లక్ష నుంచి లక్షన్నర వరకు భారం పడే అవకాశం ఉంది.
సేఫ్టీ పేరుతో ఆరు ఎయిర్ బ్యాగులని తీసుకురావడం మంచిదే
సేఫ్టీ పేరుతో ఆరు ఎయిర్ బ్యాగులని తీసుకురావడం మంచిదే అంటున్నారు జనం. ప్రతీ దానికి కస్టమర్లపైనే భారం వేయడం సరికాదంటున్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల తమ ఆదాయం పెరగకపోగా... ఖర్చులు బర్డెన్ అవుతున్నాయని అంటున్నారు. సామాన్యులపై భారం పడకుండా.. ఆటో ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. పండుగ సరదా
బేగంబజార్ లో నైట్ కైట్ ఫెస్టివల్
శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు