విమానంలో ఛార్జి లేకుండా ప్రయాణించాలని భావించాడో లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. ఒక వ్యక్తి రిస్క చేసి విమానం టైర్ లోకి వెళ్లిపోయాడు. చలికి తట్టుకోలేక లేదా ఆక్సిజన్ అందక చనిపోయాడో లేక ఇంకేం జరిగిందో కానీ.. టైర్ లో మృతదేహం చూసీ అధికారులు షాక్ కు గుర్యారు.
హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం టైరులో అధికారులు మృతదేహాన్ని గుర్తించారు. అమెరికాలో షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది. ఈ డెడ్ బాడీ ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విమానం బయటి నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్‌లోకి వెళ్లగలరు. అయితే, ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరాడనేది తెలియాల్సి ఉందని ఎయిర్‌లైన్స్ అధికారులు అంటున్నారు. అలాగే మృతుడి వివరాలను ఆరా తీస్తున్నారు. చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ తరహా రిస్క్ చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు సజీవంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ.
మంచు ప్రాంతాల్లో ప్రయాణించినపుడు అక్కడ ఉండే అతి శీతల వాతావరణ పరిస్థితుల వలన చనిపోయి ఉండవచ్చు అని అధికారులు చెబుతున్నారు. మైనస్ 50 నుంచి మైనస్ 60 డిగ్రీల చలి, అలాగే ఆక్సిజన్ అందకపోవడం వలన మృతి చెంది ఉంటాడని అధికారులు తెలిపారు.