డేవన్ కాన్వే, రవీంద్ర సెంచరీలు
9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపు
అహ్మదాబాద్: వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిస్తూ.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన న్యూజిలాండ్ మెగా ఈవెంట్‌లో బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్ డేవన్ కాన్వే (121 బాల్స్‌లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లతో 152 నాటౌట్), రాచిన్ రవీంద్ర (96 బాల్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 నాటౌట్) సెంచరీలతో దుమ్మురేపారు. ఇంగ్లిష్ బజ్‌బాల్ వ్యూహాన్ని చితక్కొడుతూ.. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని అందించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 282/9 స్కోరు చేసింది. జో రూట్ (77) టాప్ స్కోరర్. తర్వాత న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 283/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. సెకండ్ ఓవర్ తొలి బంతికే విల్ యంగ్ (0) డకౌటైనా, కాన్వే, రవీంద్ర ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. పవర్‌ప్లేలో 81/1 స్కోరు చేసిన కివీస్ మరో 82 బాల్స్ ఉండగానే విజయాన్ని అందుకుంది.
రవీంద్రకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలింగ్ అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ (3/48) కీలక వికెట్లు తీసి భారీ స్కోరు కాకుండా కాపాడాడు. బెయిర్‌స్టో (33)తో తొలి వికెట్‌కు 40 రన్స్ జోడించి డేవిడ్ మలన్ (14) ఔటయ్యాడు. ఈ దశలో రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్లను కాపాడుకుంటూ మంచి పార్ట్‌నర్‌షిప్స్ నిర్మించాడు. హ్యారీ బ్రూక్ (25) ఐదో వికెట్‌కు 70 రన్స్ జత చేశాడు. మొయిన్ అలీ (11), లివింగ్‌స్టోన్ (20), సామ్ కరన్ (14), క్రిస్ వోక్స్ (11) విఫలమైనా, బట్లర్ (43) రాణించాడు. కివీస్ బౌలర్లలో సాంట్నెర్, ఫిలిప్స్ చెరో రెండు, రవీంద్ర ఒక్క వికెట్ తీశాడు.