
హైదరాబాద్‌లో సురానా గ్రూప్‌పై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే.. బుధవారం ( ఏప్రిల్ 16 ) సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ సురానా గ్రూప్ చైర్మెన్, డైరెక్టర్ ఇళ్లలో నిర్వహించిన ఈ తనిఖీల్లో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి.. సురానా గ్రూప్‌తోపాటు సాయిసూర్య డెవలపర్స్‌పై ఏకకాలంలో 10చోట్ల జరిపిన ఈ దాడుల్లో వేలకోట్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు.
సాయి సూర్య డెవలపర్స్ ఎండీ సతీష్‌చంద్ర గుప్తా నివాసంలో జరిపిన సోదాల్లో.. హైదరాబాద్‌లో పలు కంపెనీలకు భూములను అమ్మినట్లు గుర్తించారు. ఇప్పటికే 2012లో సురానా గ్రూప్ పై సీబీఐ కేసు నమోదు కాగా.. 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది సీబీఐ. ఈ క్రమంలో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైనట్లు గుర్తించారు అధికారులు. సీబీఐ కస్టడీ నుంచి మాయమైన 103కిలోల బంగారం ఏమైందో తేల్చాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.