కొంచెం కూడా మానవత్వం లేదా: ఆ రోగం ఉంటే డెలివరీ చేయరా.. ఆస్పత్రి టాయిలెట్లో బిడ్డకు జన్మ

ఈ ఘటన చూస్తే మానవత్వం నశించిందా అనిపిస్తుంది. రోగంపై అవేర్నెస్ కల్పించి రోగిలో ధైర్యం నింపాల్సిన ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లే నిర్లక్ష్యం చేస్తే.. ఆ రోగి ఎటుపోవాలి.. దైవంగా భావించే డాక్టర్లే రోగిని అంటరానిదానిలా చూస్తే ఎలా.. కొంచెం కూడా మానవత్వం లేదా అంటున్నారు ఈ ఘటన తెలిసిన ప్రతి ఒక్కరూ.. 

మధ్యప్రదేశ్లోని షాపూర్ జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. మహిళ  టాయిలెట్లో శిశువుకు జన్మనిచ్చిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. మహిళకు హెచ్ వైవీ ఉందనే కారణంతో డెలివరీ చేసేందుకు నిరాకరించారు డాక్టర్లు, నర్సులు. దిక్కు తోచని స్థితిలో మహిళ టాయిలెట్లో ప్రసవించింది. 

అయితే ఆస్పత్రి డాక్టర్లు మరోలా చెబుతున్నారు.. డెలివరీకి ఆస్పత్రిలో చేరిన మహిళకు మొదట్లో హెచ్ఐవీ ఉన్నట్లు మాకు తెలియదు. పరీక్షలు నిర్వహించాక హెచ్ ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను మెటర్నిటీ ట్రామా సెంటర్ లో చేర్చాం. అయితే ఆమె వెనకనుంచి బయటికి వెళ్లి బాత్ రూంలో ప్రసవించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ సీత్యా నాయక్ చెప్పారు.  బిడ్డను, తల్లిని వేర్వేరుగా ఉంచారు. ఇదిలా ఉంటే వైద్యులు అన్ని రకాల చర్యలు తీసుకుంటు ప్రోటోకాల్ పాటిస్తున్నారు. మహిళకు చికిత్స చేసిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు HIV సంక్రమణ నుంచి రక్షణ కోసం టీకాలు ఇచ్చారు. 

ALSO READ : ప్రవళికది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ హత్యే: పొన్నం ప్రభాకర్