- బాలానగర్లో ర్యాపిడో డ్రైవర్ హత్య
కూకట్పల్లి, వెలుగు: బాలానగర్ పీఎస్పరిధిలో ర్యాపిడో డ్రైవర్ను హత్య చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కాలె దినేశ్(32) కొన్నేండ్ల కింద క్రితం నగరానికి వచ్చి బాలానగర్ పరిధి పంచశీలకాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ర్యాపిడో డ్రైవర్గా, స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం భార్య లక్ష్మికి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేసి తను వేరే పని మీద వెళ్తున్నానని, ఇంటికి రావటానికి లేటవుతుందని చెప్పాడు. ఆదివారం ఉదయం ఐడీపీఎల్కి చెందిన ఫారెస్ట్ భూమిలో దినేశ్చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి నోరు, ముక్కు నుంచి రక్తం కారిన మరకలున్నాయని పోలీసులు తెలిపారు. హత్యకు గురయ్యాడని ప్రాథమికంగా నిర్ధారించారు.