పట్ట పగలు హైదరాబాద్ సిటీలో ర్యాష్ డ్రైవింగ్ : హోటల్ మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ మృతి

పట్ట పగలు హైదరాబాద్ సిటీలో ర్యాష్ డ్రైవింగ్ : హోటల్ మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ మృతి

పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎంటే ఎంత బిజీగా ఉంటుంది.. అలాంటి ఏరియాలో ఓ కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం చేశాడు.. బైక్ పై వెళుతున్న ఓ స్టూడెంట్ ను ఢీకొట్టి.. అతని మరణానికి కారణం అయ్యాడు ఆ కారు డ్రైవర్.. పూర్తి వివరాల్లోకి వెళితే..

2024, ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని రాంనగర్ చౌరస్తా నుంచి వీఎస్టీ వెళ్లే రహదారిలో.. వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు.. పల్సర్ బైక్ పై వెళుతున్న కుర్రోడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల నిఖిల్ కుమార్ స్పాట్ లోనే చనిపోయాడు. నిఖిల్ కుమార్.. హోటల్ మేనేజ్ మెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రమాదానికి కారు అతి వేగం.. ర్యాష్ డ్రైవింగ్ కారణం అని పోలీసుల ప్రాథమిక సమాచారం. 

నిఖిల్ కుమార్ చేతికి రాఖీలు ఉన్నాయి.. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన అక్కాచెల్లెళ్లతో వేడుక జరుపుకున్న 24 గంటల్లోనే ఇలా జరగటాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.